Home  »  TSPSC  »  Human Resources-Population Statistics

Human Resources-Population Statistics (మానవ వనరులు-జనాభా గణాంకాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

ఒక దేశంలో శిశు జనాభా వృద్ధి రేటు కంటే పనిచేసే వయస్సు గల జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంటే అది దేనికి దారి తీస్తుంది?

  1. అనాధారిత నిష్పత్తి
  2. అధిక ఆధారిత నిష్పత్తి
  3. మధ్యస్థ ఆధారిత నిష్పత్తి
  4. అల్ప ఆధారిత నిష్పత్తి
View Answer

Answer: 4

అల్ప ఆధారిత నిష్పత్తి

Question: 37

శిశు లింగ నిష్పత్తిని కింది వాటిలో దేని ప్రకారం నిర్వహించవచ్చు?

  1. శూన్యం నుంచి 6 ఏళ్ళ వయస్సు గ్రూప్ గల ప్రతి వెయ్యి మంది బాలురకు అదే వయస్సు గ్రూప్ లో ఉండే బాలికల సంఖ్య.
  2. శూన్యం నుంచి 4 ఏళ్ళ వయస్సు గ్రూప్ గల ప్రతి వెయ్యి మంది బాలికలకు అదే వయస్సు గ్రూప్ లో ఉండే బాలురు సంఖ్య.
  3. శూన్యం నుంచి 6 ఏళ్ళ వయస్సు గ్రూప్ గల. ప్రతి వెయ్యి మంది బాలికలకు అదే వయస్సు గ్రూప్ లో ఉండే బాలుర సంఖ్య.
  4. శూన్యం నుంచి 4 ఏళ్ళ వయస్సు గ్రూప్ గల ప్రతి వెయ్యి మంది బాలురకు అదే వయస్సు గ్రూప్ లో ఉండే బాలికల సంఖ్య
View Answer

Answer: 1

శూన్యం నుంచి 6 ఏళ్ళ వయస్సు గ్రూప్ గల ప్రతి వెయ్యి మంది బాలురకు అదే వయస్సు గ్రూప్ లో ఉండే బాలికల సంఖ్య.

Question: 38

ఒక దేశ జనాభాలో శ్రామికేతరులతో పోలిస్తే శ్రామికుల వాటా అధికంగా ఉంది అంటే ఏమని అర్థం?

  1. పెట్టుబడికి అవసరమైన మిగులు నిలకడగా ఉందని అర్ధం.
  2. పెట్టుబడి చేయడానికి అవసరమైన మిగులు అల్పంగా ఉంది అని అర్ధం.
  3. పెట్టుబడి చేయడానికి మిగులు అధికంగా ఉంది అని
  4. పెట్టుబడికి అవసరమైన మిగులు తీవ్రంగా తగ్గవచ్చు.
View Answer

Answer: 3

పెట్టుబడి చేయడానికి మిగులు అధికంగా ఉంది అని

Question: 39

పట్టణపు జనాభాకు సంబంధించి కింది రాష్ట్రాలలో మొదటి మూడు స్థానాలను పొందినవి ఏవి?
1. మహారాష్ట్ర             3. ఆంధ్రప్రదేశ్
2. ఉత్తరప్రదేశ్         4. తమిళనాడు

  1. 1. 2 & 3
  2. 1, 2 & 4
  3. 1, 3 & 4
  4. 2, 3 & 4
View Answer

Answer: 2

1, 2 & 4

Question: 40

ప్రణాళికా సంఘం ప్రకారం కింది రాష్ట్రాలలో మహిళా అక్షరాస్యతా రేటు విషయంలో 2011లో తక్కువ ఫలితాలను పొందిన రాష్ట్రాలు ఏవి?
1. బీహార్                      3. రాజస్థాన్
2. మహారాష్ట్ర               4. ఉత్తరాఖండ్

  1. 1 & 2 మాత్రమే
  2. 2 & 4 మాత్రమే
  3. 1 & 3 మాత్రమే
  4. 3 & 4 మాత్రమే
View Answer

Answer: 3

1 & 3 మాత్రమే