Home  »  TSPSC  »  Green Revolution

Green Revolution (హరిత విప్లవం) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

1960వ దశకంలో భారతదేశంలో వ్యవసాయరంగంలో ఏర్పడిన స్తబ్దతను అధిగమించడానికి దేశంలో హరిత విప్లవాన్ని వేగిరపరచడానికి భారత ప్రభుత్వం వ్యవసాయ విధానంలో కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పులను ఏమని వ్యవహరిస్తారు.

  1. సాంద్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం
  2. నూతన వ్యావసాయక వ్యూహం
  3. అధిక దిగుబడి విత్తనాల కార్యక్రమం
  4. అనావృష్టికి గురయ్యే ప్రాంతాల కార్యక్రమం
View Answer

Answer: 2

నూతన వ్యావసాయక వ్యూహం

 

Question: 12

నూతన హరిత విప్లవం దీనిని కోరుకుంటుంది:

  1. జిఎం వెరైటీ విత్తనాల ఉపయోగం
  2. వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులు
  3. వ్యవసాయం కారణంగా జరిగే పర్యావరణ హానిని కనిష్టం చేయడం
  4. ప్రజల ఆహారంలో ధాన్యాల స్థానాన్ని జంతు ఉత్పత్తులతో భర్తీ చేయడం
View Answer

Answer: 3

వ్యవసాయం కారణంగా జరిగే పర్యావరణ హానిని కనిష్టం చేయడం

Question: 13

భారతదేశంలోని ఈ క్రింది వ్యవసాయ మరియు అనుబంధ రంగ ఉత్పుత్తులను వాటి సంబంధిత విప్లవాలతో జతపరచండి
వ్యవసాయ మరియు అనుబంధ రంగ ఉత్పత్తులు
ఎ. వరి మరియు గోధుమ

బి. నూనె గింజలు

సి. ఆక్వాకల్చర్ మరియు చేపల పెంపకం

విప్లవాలు
1. నీలి విప్లవం
2. హరిత విప్లవం

3. స్వర్ణ విప్లవం
4. పసుపు పచ్చ విప్లవం

  1. ఎ-2 : బి-4, సి-1
  2. ఎ-3 : బి-4, సి-2
  3. ఎ-2 : బి-3 : సి-1
  4. ఎ-4 : బి-3 : సి-1
View Answer

Answer: 1

ఎ-2 : బి-4, సి-1

Question: 14

హరిత విప్లవానికి సంబంధించి దిగువ వాటిలో ఏది సత్య
1. “హరిత విప్లవం” అనే పదం కొత్త పంట రకాలను అభివృద్ధి చేయడం ద్వారా మొక్కల బ్రీడర్లు ధాన్యం దిగుబడిలో పొందిన గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది.
2. అధిక దిగుబడినిచ్చే రకాల (హెచ్వైవి)ను ఉపయోగించడం ద్వారా వరి, గోధుమలు, మొక్కజొన్న మరియు ఇతర పంటల దిగుబడిలో గొప్ప లాభాలను వివరించడానికి మార్చి 1960లో విలియం గాండ్ ‘హరిత విప్లవం’ అనే పదబంధాన్ని మొదటగా ఉపయోగించాడు.

  1. 1 మాత్రమే సత్యం
  2. 2 మాత్రమే సత్యం
  3. 1 మరియు 2 రెండూ సత్యం
  4. 1 కానీ లేదా 2 కానీ సత్యం కాదు
View Answer

Answer: 1

1 మాత్రమే సత్యం

Question: 15

భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ టెక్నాలజీ గురించి నిజం ఏమిటి?
1. “హరిత విప్లవం” అనే పదం కొత్త పంట రకాలను అభివృద్ధి చేయడం ద్వారా మొక్కల బ్రీడర్లు ధాన్యం దిగుబడిలో పొందిన గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది.
2. హరిత విప్లవం తీసుకురావడానికి దోహదపడిన అంశాలు: అధిక దిగుబడినిచ్చే రకాల పంటల పరిచయం, బహుళ పంటలు, మెరుగైన నీటిపారుదల, తగినంత ఎరువులు సరఫరా చేయడం

  1. 1 మాత్రమే నిజం
  2. 2 మాత్రమే నిజం
  3. 1 మరియు 2 రెండూ నిజం
  4. 1 కానీ లేదా 2 కానీ నిజం కాదు.
View Answer

Answer: 3

1 మరియు 2 రెండూ నిజం