Home  »  TSPSC  »  South India

South India (దక్షిణ భారతదేశం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

క్రింది తమిళ గ్రంథాలలో వ్యాకరణ గ్రంథం ఏది?

  1. మణిమేకలై
  2. సిలాప్పదికారం
  3. తోల్కప్పియం
  4. పదిర్రుప్పత్తు
View Answer

Answer: 3

తోల్కప్పియం

Question: 7

ఈ క్రింది వాటిలో ఏది సరికానటువంటి జత?

  1. ముచిరి – చేర రాజ్యం ఓడరేవు
  2. మధురై – పాండ్యుల రాజధాని
  3. కోర్కయి – చేర రాజ్యము రాజధాని
  4. ఉరయూర్ – తొలి చోళుల రాజధాని
View Answer

Answer: 3

కోర్కయి – చేర రాజ్యము రాజధాని

Question: 8

చోళుల కాలం నాటి నటరాజ కాంస్య ప్రతిమకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి.
ఎ. ‘తిరోభవ’ భంగిమను సూచిస్తూ శివుడు తన కుడి కాలుపై నిలుచుని ఉండును
బి. శివుడు తన ఎడమ కాలును ‘భుజంగత్రాసిత భంగిమ’లో పైకి లేపినట్లు సూచించబడి భక్తుడి మనస్సు నుండి భ్రాంతిని తరిమికొట్టడానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా చూపుతుంది
సి. కుడిచేతిలో శివునికి ఇష్టమైన సంగీత వాయిద్యమైన ‘ఢమరుకం’ ఉంటుంది.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది/ఏవి సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. బి మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 4

ఎ, బి మరియు సి

Question: 9

ప్రతిపాదన (A): చోళులు ఆగ్నేయ ఆసియాలో భారతీయ సంస్కృతి మరియు వారసత్వ సంపదను వ్యాప్తి చేయడానికై విదేశీ గడ్డపై ఒక బలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు.

కారణము (R): చోళ పాలకులు భారతీయ సంస్కృతి, మతం మరియు వారసత్వ సంపద వంటి వాటిపై అత్యంత మక్కువ కలిగిన వారు.

  1. A మరియు R రెండూ నిజము. R, A కు సరైన వివరణ కాదు.
  2. A నిజం కాని R తప్పు
  3. A తప్పు కాని R నిజం
  4. A మరియు R రెండూ నిజము మరియు R, A కు సరైన వివరణ
View Answer

Answer: 3

A తప్పు కాని R నిజం

Question: 10

చోళుల కాలంలోని పరిపాలన విభాగములను ఆరోహణ క్రమంగా గుర్తించుము

  1. నాడు, వలనాడు, మండలం మరియు ఖుర్రములు
  2. మండలం, నాడు వలనాడు మరియు ఖుర్రములు
  3. ఖుర్రమ్, నాడు, వలనాడు మరియు మండలములు
  4. ఖుర్రమ్, మండలం, వలనాడు, మరియు నాడులు
View Answer

Answer: 3

ఖుర్రమ్, నాడు, వలనాడు మరియు మండలములు

Recent Articles