Home  »  TSPSC  »  Parts of the Constitution–Schedules–Preamble

Parts of the Constitution – Schedules – Preamble (రాజ్యంగ భాగాలు – -షెడ్యూల్స్ – ప్రవేశిక) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

భారతదేశ జాతీయ గీతం ఈ భావాన్ని వ్యక్తీకరించుతుంది.

  1. భారతదేశం యొక్క సమైక్యత
  2. నదుల అనుసంధానం
  3. నిబంధనలను అమలు చేయటంలో వైవిధ్యం
  4. భౌగోళిక వర్ణస
View Answer

Answer: 1

భారతదేశం యొక్క సమైక్యత

Question: 37

కింది వాటిని జతపరచండి. 

జాబితా -1

ఎ. 7వ షెడ్యూల్

బి. 8వ షెడ్యూల్

సి. 9వ షెడ్యూల్
డి. 10వ షెడ్యూల్
జాబితా -2

1. భూ సంస్కరణలు మరియు రిజర్వేషన్స్
2. పిరాయింపు నిరోధక చట్టం
3. అధికార విభజన
4. పంచాయతీరాజ్ వ్యవస్థ

  1. ఎ-5, బి-3, సి-4, డి-2
  2. ఎ-3, బి-5, సి-1, డి-2
  3. ఎ-3, బి-5, సి-1, డి-4
  4. ఎ-5, బి-3, సి-1, డి-2
View Answer

Answer: 2

ఎ-3, బి-5, సి-1, డి-2

Question: 38

కింది వివరణ (వ్యాఖ్య)లలో సరియైనది/ఏది?

ఎ. సౌభ్రాతృత్వం అనే రాజ్యాంగం యొక్క మౌలిక విలువ

బి. ఇది మౌలిక విలువ ఎందుకంటే భారత రాజ్యాంగపు పార్ట్-3లో స్పష్టంగా చెప్పబడింది

సి. ఇది మౌలిక విలువ కాదు ఎందుకంటే భారత రాజ్యాంగంలో చెప్పబడలేదు

డి. ఇది మౌలిక విలువ ఎందుకంటే భారత రాజ్యాంగం పీఠికలో ఒక భాగం మరియు భారత రాజ్యాంగం ప్రాథమిక వ్యవస్థలో భాగంగా గుర్తించారు.

సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. సి మాత్రమే
  2. ఎ, బి మరియు డి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ మరియు డి మాత్రమే
View Answer

Answer: 4

ఎ మరియు డి మాత్రమే

Question: 39

ఈ క్రింది వాటిలో ఏవి ఆదేశిక సూత్రాలలో పొందుపరచబడినవి.

ఎ. మానవ అక్రమ రవాణా మరియు నిర్బంధ కార్మికుల వ్యవస్థ నిషేధం

బి. ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పానీయాలను మరియు ఇతర మత్తు పదార్థాలను, వైద్యం కొరకు మాత్రం మినహాయించి, నేషేధించడం

సి. అందరికి సమాన అవకాశాలు కల్పించడం

సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. బి మరియు సి
  4. ఇవన్నియు
View Answer

Answer: 2

బి మాత్రమే

Question: 40

భారత రాజ్యాగ పీఠికకు సంబంధించి కింది వివరణలను పరిశీలించండి.

ఎ. లక్ష్యాలు, ఆశయాల తీర్మానంపై భారత రాజ్యాంగ పీఠిక ఆధారపడింది.

బి. భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం రాజ్యాంగం తన అధికారాన్ని భారత ప్రజల నుండి గ్రహిస్తుంది.

సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మరియు బి రెండూ సరియైనవి.
  2. ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
  3. ఎ మాత్రమే సరియైనది
  4. బి మాత్రమే సరియైనది కాదు.
View Answer

Answer: 1

ఎ మరియు బి రెండూ సరియైనవి.