Home  »  TSPSC  »  State Government

State Government (రాష్ట్ర ప్రభుత్వాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

గవర్నరుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రివర్గం నలహా ఇచ్చేందుకు భారత రాజ్యాంగంలోని క్రింది నిబంధన వీలు కల్పిస్తుంది?

  1. 169(1) ఆర్టికల్
  2. 168(1) ఆర్టికల్
  3. 163(1) ఆర్టికల్
  4. 166(1) ఆర్టికల్
View Answer

Answer: 3

163(1) ఆర్టికల్

Question: 47

ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.

ఎ. అధికారంలో ఉన్న గవర్నర్ పై ఏవిధమైన క్రిమినల్ విచారణ జరపడానికి వీల్లేదు.

బి. పదవిలో ఉన్న కాలంలో రాష్ట్రగవర్నర్కు ఇచ్చే జీత భత్యాలను కుదించడానికి వీల్లేదు.

పై వ్యాఖ్యల్లో ఏది నిజం?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఎ లేదా బి ఏదీ కాదు
View Answer

Answer: 3

ఎ మరియు బి

Question: 48

క్రింది వివరణలను పరిశీలించండి.

ఎ. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎంపిక చేయబడిన వ్యక్తి శాసనసభ సభ్యుడిగా ఉండవలసిన అవసరం లేదు

బి. శాసనసభ సభ్యుడిగా అనర్హత వేటుపడినప్పటికీ, ముఖ్యమంత్రి కావడానికి అది అభ్యంతరం కాదు

సి. అసెంబ్లీలో సభ్యుడిగా ఉండటానికి అనర్హత వేటుపడితే ముఖ్యమంత్రిగా ఎంపికైన ఆ వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయలేదు.

సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. బి & సి మాత్రమే
  2. ఎ & సి మాత్రమే
  3. ఎ, బి & సి
  4. ఎ & బి మాత్రమే
View Answer

Answer: 2

ఎ & సి మాత్రమే

Question: 49

కింది వ్యాఖ్యలను పరిశీలించండి.

ఎ. రాష్ట్ర పరిధి దాటి గవర్నర్ చేసే అధికార పర్యటనల గురించి భారత గృహ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రకంటింది.

బి. ఇప్పుడు గవర్నర్లు పర్యటనల విషయమై రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి మరియు పర్యటనలు ఒక సంవత్సరంలో 73 రోజుల కన్నా మించకూడదు.

సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ మరియు బి రెండూ సరియైనవి.
  2. ఎ మరియు బి రెండూ సరియైనవి కావు
  3. ఎ మాత్రమే సరియైనది
  4. బి మాత్రమే సరియైనది
View Answer

Answer: 1

ఎ మరియు బి రెండూ సరియైనవి.

Question: 50

రాష్ట్రానికి చెందిన బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తే, రాష్ట్రపతి అధికారానికి సంబంధించి క్రింది వివరణలను పరిశీలించండి.

ఎ. రాష్ట్రపతి ఆ బిల్లు పై సంతకం చేయవచ్చు.

బి. రాష్ట్ర శాసనసభకు పునఃపరిశీలన కొరకు రాష్ట్రపతి తిప్పి పంపవచ్చు.

సి. రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా రాష్ట్ర శాసనసభ 6 నెలలలోపు పునఃపరిశీలించాలి.

డి. సవరణలతో గానీ లేదా సవరణలు లేకుండా గాని రాష్ట్రపతి రెండవసరా రాష్ట్రశాసన సభ ఆమోదిస్తే, తప్పనిసరిగా సంతకం చేయాలి.

సరైన జవాబును ఎంపిక చేయండి.

  1. ఎ, బి మరియు సి మాత్రమే.
  2. ఎ, బి మరియు డి మాత్రమే
  3. బి, సి మరియు డి మాత్రమే
  4. ఎ మరియు సి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, బి మరియు సి మాత్రమే.

Recent Articles