Home  »  TSPSC  »  Later Vedic Civilization

Later Vedic Civilization (వైదిక నాగరికత) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ఈ క్రింది నదులను వాటి ప్రాచీన నామముతో జతపరుచుము.
1. జీలమ్             ఎ. విపాస
2. బియాస్          బి. పరుషి
3. చినాబ్            సి. వితస్ద
4. రావి                 డి. అస్కిని

  1. 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
  2. 1-సి, 2-ఎ, 3-డి, 4-బి.
  3. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
  4. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
View Answer

Answer: 2

1-సి, 2-ఎ, 3-డి, 4-బి.

Question: 22

రుగ్వేద కాలము నాటి ఆర్థిక వ్యవస్థ లక్షణములు ఈ క్రింది వాటిలో ఏవి?
1. ప్రాథమికంగా ఇది సంచార ఆర్థిక వ్యవస్థ

2. వీరు వివిధ ధాన్యములను పండించేవారు.

3. ఈ కాలములో పెద్ద సంఖ్యలో వేతన జీవులు ఉండేవారు
ఈ క్రింది ఇచ్చినటువంటి సూచికల ఆధారంగా సరైన జవాబును ఎంచుకొనుము.

  1. 1 & 2 మాత్రమే
  2. 2 & 3 మాత్రమే
  3. 1 & 3 మాత్రమే
  4. 1, 2 & 3 మాత్రమే
View Answer

Answer: 1

1 & 2 మాత్రమే

Question: 23

మహాజన పదములలో మగథ విజృంభణకు గల కారణము
1. కీలక ప్రదేశంలో ఉండడము
2. బుద్ధుని యొక్క వివిధ కార్యక్రమములలో మమేకము కావడం
3. సారవంతమైన భూములు కల్గి ఉండడము
ఈ క్రింద ఈయబడిన సూచికల ఆధారంగా సరైన జవాబు ఎంచుకొనుము.

  1. 1 మరియు 2
  2. 1 మరియు 3
  3. 2 మరియు 3
  4. 1, 2 మరియు 3
View Answer

Answer: 2

1 మరియు 3

Question: 24

వైదిక బలుల ఆచారం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి.
ఎ. శ్రాత (వైదిక బలులు) లో మూడు రకాల అగ్ని ఉపయోగించడం జరిగింది. అవి – గార్హపత్య (గృహస్థుల అగ్ని), ఆహవనీయ (అర్పణ అగ్ని) మరియు దక్షిణాగ్ని (దక్షిణ అగ్ని).
బి. ఈ మంటలను విభిన్న ఆకారాల గుంటలలో ఉంచాలి. అంటే గార్హపత్యం చతురస్రాకారంగా, ఆహవనీయం గుండ్రంగా మరియు దక్షిణాగ్ని దీర్ఘచతురస్రాకారంలో
ఉండాలి.
పైన ఇవ్వబడిన ప్రకటనలలో ఏది సరైనది/ఏవి సరైనవి?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ మరియు బి
  4. ఏదీ కాద
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Question: 25

ఋగ్వేద కాలపు మత విశ్వాసాలకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి:

I. గ్రీకులకు జూపిటర్ వలె ఋగ్వేద ఆర్యులకు దయాస్ దివ్యమైన దేవుడు.
II. పృథ్వీని దేవతలందరికీ తల్లిగా భావించేవారు.
III. దేవతలకు నివేదనలను తీసుకోని వెళ్లె మధ్యవర్తిగా అగ్నిని పూజించేవారు.
IV. గోవుని బలి యివ్వడం కూడా పూజలో భాగంగా ఉంది.

  1. I, II మరియు III మాత్రమే
  2. II, III మరియు IV మాత్రమే
  3. I, III మరియు IV మాత్రమే
  4. I, II మరియు IV మాత్రమే
View Answer

Answer: 3

I, III మరియు IV మాత్రమే