Home  »  TSPSC  »  Mughals

Mughals (మొఘల్ సామ్రాజ్యం) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

బనారస్ మరియు అలహాదాబాద్ పై యాత్రికుల పన్నును రద్దు చేయాలని కోరుతూ మొగులు చక్రవర్తికి విన్నవించడానికి వెళ్లిన బనారస్ పండితుల బృందానికి నాయకత్వం వహించినది ఎవరు?

  1. హరనాథ్
  2. జగన్నాథ్
  3. కవీంద్రాచార్య
  4. కవి హరిరాం
View Answer

Answer: 3

కవీంద్రాచార్య

Question: 52

షాజహాన్ బాల్ఖ్ యుద్ధం వెనుక ఉద్దేశ్యం

  1. కాబూల్ సరిహద్దులలో ఉన్న బాల్ఖ్ మరియు బదాక్షన్ ల మధ్య స్నేహపూర్వక పాలకుడిని పొందడానికి
  2. మొఘలుల మాతృభూములైన సమర్ ఖండ్ మరియు ఫెర్హానాలను గెలుచుకోవడానికి
  3. ‘శాస్త్రీయ రేఖ’ అయిన అము దరియాలో మొఘలు సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి
  4. ఉపఖండం దాటి మొఘలు సామ్రాజ్యాన్ని విస్తరించడానికి
View Answer

Answer: 1

కాబూల్ సరిహద్దులలో ఉన్న బాల్ఖ్ మరియు బదాక్షన్ల మధ్య స్నేహపూర్వక పాలకుడిని పొందడానికి

Question: 53

‘చాహర్ త స్లీం” అంటే ఏమిటి?

  1. ఇది ఒక నమస్కార పద్ధతి
  2. అబుల్ ఫజల్ రాసిన ఒక గ్రంథం
  3. నూర్జహాన్ కవితల సంపుటి
  4. ఇది ఒక నాట్య రూపం
View Answer

Answer: 1

ఇది ఒక నమస్కార పద్ధతి

Question: 54

కింది చరిత్రకారుడు తాజ్ మహల్ ఐరోపా, ఆసియాల మేధో కలయిక అని పేర్కొన్నాడు:

  1. రాల్ఫ్ ఫిచ్
  2. టావెర్నియర్
  3. వి.ఎ.స్మిత్
  4. ఫెర్గుసన్
View Answer

Answer: 3

వి.ఎ.స్మిత్

Question: 55

జహంగీర్ పాలనాక్రమంలో క్రింద పేర్కొన్న ఏ సంఘటనలు చోటు చేసుకున్నాయి.

I. సిక్కుల ఐదవ గురువు గురు అర్జన్ దేవ్కు మరణ శిక్ష విధించటం

II. మేవాడ రాజపుత్రులపై విజయం

III. కాబూల్, కాందహార్ ఆక్రమణ

IV. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకు ఆగమనం

దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి :

  1. I,II మరియు III మాత్రమే
  2. II, III మరియు IV మాత్రమే
  3. I, III మరియు IV మాత్రమే
  4. I, II మరియు IV మాత్రమే
View Answer

Answer: 4

I, II మరియు IV మాత్రమే