Home  »  TSPSC  »  Pre-Medieval Period

Pre-Medieval Period (మధ్య యుగ పూర్వ కకాలం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

క్రింది జతల పదాలు మరియు వాటి అర్థాలకు సంబంధించి సరిగ్గా జతపరచనిది ఏది?

  1. నగరక్కణీ : నగరం ఆధీనంలో ఉన్న భూమి
  2. నట్టర్ : నరుని రూపంలో ఉన్న నాగదేవత
  3. యూప : యజ్ఞబలి స్తంభం
  4. వీరగల్: తమిళనాడు ప్రాంతంలోని ‘వీరశిల’
View Answer

Answer: 2

నట్టర్ : నరుని రూపంలో ఉన్న నాగదేవత

Question: 7

కోణార్క్ సూర్య దేవాలయంనకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి:

ఎ. కోణార్క్ భానుదేవుడు సూర్యుని రథపు స్మారక చిహ్నం.

బి. దీని 24 చక్రాలు ప్రతీకాత్మక ఆకృతులను కలిగి ఉన్నాయి.

సి. రథాన్ని పదహారు అశ్వాల బృందం నడిపిస్తున్నట్లు ఉ న్నది.

డి. ఇది గంగా రాజ వంశానికి చెందిన రాజు మొదటి నరసింహదేవ్ నిర్మించబడినదిగా పరిగణించబడుతున్నది.

ఇ. దీని శిల్పాల అలంకరణ అద్భుతమైన సింహాలు, సంగీతకారులు, నృత్యకారులతో కూడుకుని ఉన్నది. సరైన జవాబును ఎంచుకొనుము :

  1. ఎ, బి, సి & డి మాత్రమే
  2. ఎ, బి, సి & ఇ మాత్రమే
  3. ఎ, బి, డి & ఇ మాత్రమే
  4. ఎ, సి, డి, & ఇ మాత్రమే
View Answer

Answer: 3

ఎ, బి, డి & ఇ మాత్రమే

Question: 8

ఖజురహో సమూహ స్మారక శిల్పాలకు సంబంధించి ఈ కింది వాటిని పరిణించండి:
ఎ. ఖజురాహోలోని దేవాలయాలు శుంగ రాజవంశ కాలంలో నిర్మించబడ్డాయి.
బి. ఇవి హిందూ, జైన అనే రెండు వేర్వేరు మతాలకు చెందినవి.
సి. ఇవి అత్యున్నత నాణ్యత కలిగిన నగారా ఆలయ శిల్పశైలి ఆలయాల వాస్తవికతను ప్రదర్శిస్తాయి.
డి. ఇవి చుట్టూ తల అలంకార పూరిత పందిరులతో కూడి ఎత్తైన వేదికలపై ఇసుక రాయితో  నిర్మించబడినాయి.

ఇ. ఖజురహో లోని దేవాలయాలు చండేలా రాజవంశ కాలంలో నిర్మించబడ్డాయి.
సరైన జవాబును ఎంచుకొనుము :

  1. ఎ, సి & డి మాత్రమే
  2. ఎ, బి, సి & డి మాత్రమే
  3. బి, సి & డి మాత్రమే
  4. బి, సి, డి & ఇ మాత్రమే
View Answer

Answer: 4

బి, సి, డి & ఇ మాత్రమే

Question: 9

తోమార్ రాజపుత్లచే నిర్మించబడిన ఖిలారాయ్ పితోర ఏ నగరంలో ఉంది?

  1. చిత్తోర్ ఘడ్
  2. జైపూర్
  3. ఉదయ్పూర్
  4. ఢిల్లీ
View Answer

Answer: 4

ఢిల్లీ

Question: 10

పూరిలోని జగన్నాథ దేవాలయ నిర్మాత ఎవరు?

  1. కపిలేంద్ర గజపతి
  2. పురుషోత్తమ గజపతి
  3. అనంతవర్మ చోడ
  4. భానుదేవవర్మ చోడ
View Answer

Answer: 3

అనంతవర్మ చోడ

Recent Articles