Home  »  TSPSC  »  Sustainable Development Goals

Sustainable Development Goals (సుస్థిరాభివృద్ది లక్ష్యాలు) Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

ఈ క్రింది వాటిలో సుస్థిర అభివృద్ధిలో ఏది అతి ముఖ్య లక్షణంగా పరిగణించబడుతున్నది?
4.

  1. తరాల మధ్య సమానత్వం
  2. తరాలలో అసమానత్వం
  3. మద్యంపై వ్యయం పెరుగుదల
  4. పొదుపు స్థాయి పెరుగుదల
View Answer

Answer: 1

తరాల మధ్య సమానత్వం

Question: 22

భారతదేశం తన సుస్థిరాభివృద్ధి వ్యూహాన్ని 2002లో నిర్వహించిన ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సదస్సులో సమర్పించింది. సుస్థిరాభివృద్ధిపై భారతదేశ వ్యూహంలో ప్రధాన ఉద్దేశాలు

ఎ. పేదరికంపై పోరు

బి. ప్రజలకు సాధికారిత కల్పించడం

సి. ప్రజల ఆరోగ్య మరియు విద్యా స్థితిని మెరుగుపరచడం

డి. సైన్స్ & టెక్నాలజీ కీలక అంశాలను ఉ పయోగించుకోవడం

ఇ. పర్యావరణ ప్రామాణికాలను ఏర్పాటు చేయడం

ఎఫ్. ప్రత్యుత్పత్తి రేటు, శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటును తగ్గించడం
దిగువన ఇచ్చిన కోడ్ నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి

  1. ఎ, బి, సి, డి, ఇ మరియు ఎఫ్
  2. ఎ, సి మరియు ఎఫ్ మాత్రమే
  3. ఎ, బి, డి మరియు ఇ మాత్రమే
  4. ఎ, బి మరియు సి మాత్రమే
View Answer

Answer: 3

ఎ, బి, డి మరియు ఇ మాత్రమే

Question: 23

భారతదేశంలో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో ప్రతిపాదించబడిన వాటిలో ఒకటి:

  1. దేశంలో ధనవంతుల సంఖ్యను పెంచడం
  2. అధిక విక్రయ ఉత్పత్తి పద్ధతులను అనుసరించడం
  3. అన్ని రూపాలలోని పేదరికాన్ని, దారిద్ర్యాన్ని నిర్మూలించడం
  4. పరిశ్రమలకు పెద్ద మొత్తాలలో సబ్సిడీలను ఇవ్వడం
View Answer

Answer: 3

అన్ని రూపాలలోని పేదరికాన్ని, దారిద్ర్యాన్ని నిర్మూలించడం

Question: 24

కింది వాటిలో దేని కొరకు వనరులను కాపాడినట్లయితే (రిజర్వు చేసినట్లయితే) సుస్థిరమైన అభివృద్ధిగా చెప్పవచ్చు?

  1. ప్రస్తుత తరానికి మాత్రమే
  2. రాబోవు తరానికి మాత్రమే
  3. స్వల్పకాలిక వ్యవధికి మాత్రమే
  4. ప్రస్తుత కాలపు అవసరాలను భావితరాల అవసరాలతో సమతుల్యం చేసుకుంటూ రక్షించుకోవడం
View Answer

Answer: 4

ప్రస్తుత కాలపు అవసరాలను భావితరాల అవసరాలతో సమతుల్యం చేసుకుంటూ రక్షించుకోవడం

Question: 25

క్రింది వానిలో దేనిని సుస్థిర అభివృద్ధి భావనలో చేర్చలేదు?

  1. భవిష్యత్తు తరాల అవసరాలకు భంగం వాటిల్లకుండా ప్రస్తుత తరం ఆకాంక్షలు
  2. పర్యావరణ పరిరక్షణ
  3. స్థిరమైన లేదా పెరుగుతున్న మూలధన ఆస్తులు.
  4. కాలాంతరముగా వాతావరణ మార్పులు
View Answer

Answer: 4

కాలాంతరముగా వాతావరణ మార్పులు

Recent Articles